వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు కొద్దికాలం గ్యాప్ ఇచ్చిన నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మళ్లీ తెరపై కనిపించనున్నారు. దేవ్ మోహన్ అనే యువ హీరోతో కలిసి లావణ్య నటిస్తున్న మూవీ ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. సోషల్ మీడియాలో వచ్చే కౌంటర్స్, పంచ్ డైలాగ్ లతో సాగిన టీజర్ కామెడీ పంచుతోంది. ఈ మూవీతో తాతినేని సత్య (Tatineni Satya) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. నవ్వులు పంచుతున్న టీజర్‌ను (Sathi Leelavathi Teaser) మీరూ చూసేయండి.






