చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హనుమాన్ (Hanu-Man movie) సినిమాతో భారీ విజయం సాధించిన తేజా సజ్జ (Hero teja sajja) వరుస సినిమాలతో బిజీగా మారాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న కొత్త మూవీ ‘మిరాయ్(MIrai)’. ఈ సినిమా టీజర్‌ను ఇదివరకే చిత్రబృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘జరగబోయేది మారణహోమం.. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏశక్తీ దీన్ని ఆపలేదు..’ అంటూ ఆసక్తికర డైలాగులతో టీజర్ ఆకట్టుకుంది. మిరాయ్లో రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్ (Manchu Manoj), శ్రియా శరణ్, జగపతి బాబు, జర్మనీ నటి తంజా కెల్లర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయింది.
హనుమాన్ను మించిన బడ్జెట్..
కాగా హనుమాన్ సినిమా కంటే మిరాయ్ బడ్జెట్(Budget) పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు రూ.60 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని అంచనా. ఇకపోతే ‘హనుమాన్’ సినిమా రూ. 40 కోట్ల బడ్జెట్‌తోనే రూపొందినా వంద కోట్లకు పైగానే కలెక్షన్లు(Collections) రాబట్టింది. అయితే, ‘మిరాయ్’ని పాన్-ఇండియా అడ్వెంచర్‌గా ప్లాన్ చేయడంతో బడ్జెట్ పెరిగినట్లు సమాచారం. ‘మిరాయ్’సినిమా షూటింగ్(Shooting) ఇప్పటికే చాలావరకు పూర్తిచేసుకోగా.. నేపాల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం, ముంబైలోని చారిత్రక గుహల్లో(mumbai historical caves) పెద్ద షెడ్యూల్ జరుపుకుంది.







