పాస్​బుక్ అడిగితే..రూ.10లక్షలు డిమాండ్​ చేసి.. అడ్డంగా దోరికపోయాడిలా..

మన ఈనాడు:Shamirpet MRO Bribe Case : మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాకు చెందిన శామీర్​పేట ఎమ్మార్వో ఏసీబీ వలకు చిక్కాడు. భూమి పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.10 లక్షలు తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా ఏసీబీ అధికారులకు దొరకడంతో వారు అతణ్ని అరెస్టు చేశారు.

Shamirpet MRO Bribe Case : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట తహశీల్దార్‌ తోడేటి సత్యనారాయణ అవినీతి శాఖ అధికారులకు చిక్కాడు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ రామశేషగిరిరావు చెందిన భూమి​ శామీర్​పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు(Pass Book) జారీ చేసేందుకు, అనుకూలంగా కలెక్టర్‌కు నివేదిక పంపేందుకు ఎమ్మార్వో సత్యనారాయణ, రామశేషగిరిరావు నుంచి రూ.10లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు.Shamirpet MRO Arrest in Bribing Case : బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనతో బాధితుడు తహశీల్దార్‌ డ్రైవర్ బద్రీకి లంచం ఇస్తుండగా అధికారులు రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతణ్ని విచారించగా, తహశీల్దార్‌ ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అనంతరం ఎమ్మార్వో అక్రమాస్తులపై(Illegal Assets) కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం గత 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులను ఏసీబీ పట్టుకుంది.ACB Arrest KU Assistant Registrar Kishtaiah By Taking Bribe : పాత బిల్లుల ఆమోదానికి పాల సరఫరాదారుడు(Milk supplier) నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ కాకతీయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్(Assistant Registrar) కిష్టయ్య అవినీతి శాఖకు చిక్కాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహాలకి పాలు, పెరుగు సరఫరా కోసం కాశీబుగ్గకి చెందిన వ్యాపారి రెండేళ్లకి టెండర్‌ దక్కించుకున్నాడు.

 

Share post:

లేటెస్ట్