
హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో భూములను వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మొత్తం 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC) ద్వారా విక్రయించనుంది. రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్‌లో 46 ఎకరాలతో సహా 13 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించారు. మొత్తం 17 ల్యాండ్ పార్సిల్స్‌లోని 66 ఎకరాల అమ్మకానికి ఇటీవల TGIIC రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలిచింది. రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చేందుకు, ముఖ్యంగా ఐటీ హబ్(IT Hub) సమీపంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాట్ల మార్కెట్ ధరను చదరపు గజానికి రూ.2,16,405గా ప్రకటించారు. ఈ వేలం ద్వారా రూ. 20,000-30,000 కోట్ల ఆదాయం సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భూముల వేలం ప్రక్రియపై విమర్శలు
కాగా రాయదుర్గం, ఉస్మాన్ సాగర్ వంటి ప్రాంతాల్లో ఈ వేలాలు జరిగే అవకాశం ఉంది. ఈ భూములు ఐటీ కారిడార్‌లోని కంచ గచ్చిబౌలి పరిసరాల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ఎకరం ధర రూ. 76 కోట్ల నుంచి రూ.104.74 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మైక్రోసాఫ్ట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూఎస్ కాన్సులేట్ వంటి ప్రముఖ సంస్థల సమీపంలో ఉండటం వల్ల ఈ భూములకు డిమాండ్ ఎక్కువగా ఉంది. గతంలో రాజీవ్ స్వగృహ పథకం కింద వినియోగించని భూములను కూడా వేలం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ వేలం ప్రక్రియపై కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
టెండర్ దాఖలుకు ఆగస్టు 8 వరకు గడువు
కాగా ఇటీవల హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులు 400 ఎకరాల భూమి వేలం వల్ల పర్యావరణ, జీవవైవిధ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ వేలం ప్రక్రియను పర్యవేక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) పనిచేస్తుంది. కాగా టెండర్ దాఖలుకు ఆగస్టు 8 వరకు గడువు పెట్టింది. అదే రోజు టీజీఐఐసీ బోర్డు రూంలో టెక్నికల్ ప్రజెంటేషన్, ఆగస్ట్ 12న టెండర్ అవార్డు ఇవ్వనున్నారు.
🚨 Land Gold Rush in Osman Nagar? 🚨
TGIIC to auction 26+ acres (Plot 12–15) abutting a 100-ft road.
🔹Govt value: ₹21–25 Cr/acre
🔹Upset price: ₹13.8–16.2 Cr/acre
🔹Market reality: ₹40–45 Cr+/acre🏗️ Strong demand + prime frontage = 🔥 bidding war expected!
Big names like… pic.twitter.com/NLLooFU3mu
— Hyderabad Realty Expert Guide | GOREALTY (@gorealty_hyd) July 28, 2025