Degree Syllabus: డిగ్రీ విద్యార్థులకు కొత్త సిలబస్.. జాబ్ స్కిల్స్ పెంపే ధ్యేయం!

ManaEnadu: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, ITIల మాదిరిగా ఇకపై డిగ్రీ(Degree)లోనూ ప్రతి మూడు, నాలుగేళ్లకు ఓసారి సిలబస్‌(Syllabus)లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి(State Board of Higher Education)కి చర్యలు చేపట్టాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సుల్లో 3ఏళ్లకు ఒకసారి సిలబస్‌లో మార్పులు చేస్తుండగా.. డిగ్రీ సిలబస్‌ను మార్పులు చేసి కనీసం 6 ఏళ్ల తర్వాత గానీ మార్పు చేయడం లేదు. దీంతో విద్యార్థుల్లో టెక్నికల్, జాబ్ స్కిల్స్(Technical and job skills) తగ్గుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సిలబస్‌లో మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 వచ్చే అకడమిక్ నుంచి

ముఖ్యంగా డిగ్రీ కోర్సుల్లో మార్పులు చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరం(Next academic year) నుంచి కొత్త సిలబస్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు అకాడమీ(Telugu Academy), విద్యామండలి నిర్ణయించిన సిలబస్ బట్టి కొత్త పాఠ్య పుస్తకాలను ముద్రించనున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యార్థులకు కంప్యూటర్‌(Computer)పై అవగాహన, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టుల గురించి పూర్తిగా అవగాహన కల్పించాలని సర్కార్ భావిస్తోంది. దీని ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారని విశ్వసిస్తోంది.

ప్రత్యేక కమిటీల ఏర్పాటు

కాగా ప్రస్తుతం మన దగ్గర డిగ్రీలో 501 కాంబినేషన్ల కోర్సులు ఉన్నాయి. 4.6 లక్షలకుపైగా సీట్లుంటే ఏటా 2 లక్షల విద్యార్థులు మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 2.6 లక్షల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీ చదివిన విద్యార్థులు కాస్త వెనకపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోటీకి తగ్గట్టు డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దడానికి కొత్త సిలబస్‌ను తీసుకొస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ(Special committees)లు వేయనుంది. రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, విద్యావేత్తల నుంచి సూచనలు తీసుకోనుంది. వచ్చే ఏడాది కల్లా కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *