
గ్రూపు-2 (Telangana Group-2) అభ్యర్థులకు అలర్ట్. గ్రూపు-2 ప్రాథమిక కీ ఈనెల 18వ తేదీ (శనివారం) రోజున విడుదల కానుంది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ (TGPSC) ఓ ప్రకటనలో పేర్కొంది. ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అభ్యర్థుల లాగిన్ లో ప్రైమరీ కీ అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
రాష్ట్రంలో 783 గ్రూపు-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీపై ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ అభ్యంతరాలు ఇంగ్లీషులోనే తెలపాలని సూచించారు.