తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో భుజంగరావు, రాధాకిషన్(Bhujangarao, Radhakishan)కు గురువారం హైకోర్టు బెయిల్(High Court Bail) మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని షరతు పెట్టింది. పాస్ పోర్టులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరినీ ఆదేశించింది. ఇదే కేసులో తిరుపతన్న(Tirupattana)కు కూడా కోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు ఏడాది కాలంగా నడుస్తున్న కేసు దర్యాప్తులో భాగంగా.. కీలక పాత్రదారులైన కొందరు మాజీ పోలీసు ఉన్నతాధికారులను విచారించి, అరెస్ట్ కూడా చేశారు. ఇన్ని రోజులు విచారణలు అరెస్టులు జరగ్గా.. మొట్టమొదటిసారిగా కీలక పాత్రధారులుగా భావిస్తున్న వ్యక్తులకు బెయిల్(Bail) మంజూరు కావటం గమనార్హం.

వ్యతిరేకగళం వినిపించేవారిన టార్గెట్‌గా చేసుకుని..
కాగా తెలంగాణలో గత BRS ప్రభుత్వ హయాంలో.. ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ వ్యతిరేకంగా గళం విప్పేవారు, సొంత పార్టీలో వ్యతిరేక గళం వినిపించేవారిన టార్గెట్‌గా చేసుకుని ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం సాగినట్టుగా నిందితులు విచారణలో వెల్లడిస్తున్నారు. జడ్డిలు, జర్నలిస్టులు, విద్యార్థి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా చెబుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీ నేతలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకున్నట్టుగా.. మూడు ఉప ఎన్నికల్లో, గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana assembly Election 2023) స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) OSD ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు BRS గెలుపు లక్ష్యంగా పనిచేసినట్టుగా కూడా వాంగ్మూలంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.






