అల్లు అర్జున్ కు ఊరట.. సంధ్య థియేటర్ ఘటనలో మధ్యంతర బెయిల్

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సంధ్య థియేటర్ లో పుష్ప-2 (Pushpa 2) బెన్ ఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఆయణ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయణ్ను ఏ11గా పేర్కొన్న పోలీసులు.. మధ్యాహ్నం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

హైకోర్టులో వాదనలు

ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ (Telangana HC Allu Arjun) పై అత్యవసర విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా.. క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసం కాదని.. సోమవారం వినాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టును కోరారు. ఆయన అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలని పేర్కొనగా.. క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ (Allu Arjun Bail) ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

ప్రతి సినిమాకు బన్నీ థియేటర్ కు వెళ్తారు

ఈ సందర్భంగా లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్‌కు వెళ్తారని.. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అల్లు అర్జున్ రాత్రి 9.40కి సంధ్య థియేటర్‌కు వెళ్లి మొదటి అంతస్తులో కూర్చున్నారని.. తొక్కిసలాటలో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 

జనం ఉంటారని తెలిసినా బన్నీ వెళ్లారు

మరోవైపు పీపీ వాదనలు వినిపిస్తూ.. మధ్యాహ్నం అడగ్గానే లంచ్ మోషన్‌కు అనుమతివ్వడం తప్పుడు సంకేతం ఇస్తుందని అనగా.. క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చా? లేదా? అనే అంశంపై వాదించాలని ఈ సందర్భంగా హైకోర్టు పీపీకి సూచించింది. థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చారని.. భారీగా జనం ఉంటారని తెలిసినా అల్లు అర్జున్ వెళ్లారని పీపీ కోర్టుకు వివరించారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్‌లో ఎక్కడా కోరలేదని పీపీ .. క్వాష్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని, సోమవారం విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు.

అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్

ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. పూర్తిస్థాయి బెయిల్‌కు నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌పై పీపీ అభ్యంతరం తెలిపారు. క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *