ఫ్యామిలీ ఆడియెన్స్​కు షాక్.. ఇకపై ఆ షోలకు పిల్లలకు నో ఎంట్రీ!

వీకెండ్ రాగానే పిల్లలతో హాయిగా సినిమాకు వెళ్దామనుకుంటున్నారా.. ఐతే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయంపై తెలంగాణ హైకోర్టు (Telangana HC) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు షోలకు పిల్లలను అనుతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తరువాత షోలకు 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని సూచించింది. ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ సినిమా టిక్కెట్ ధరల పెంపును, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్​సేన్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

మైనర్లను అనుమతించొద్దు

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెనిఫిట్ షో(Benefit Show)కు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునః సమీక్షించి బెనిఫిట్ షోలకు అనుమతించరాదని ఆదేశిస్తూ జనవరి 11న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40లోపు, అర్ధరాత్రి 1.30 గంటల తరువాత సినిమాలకు అనుమతించరాదని.. ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని కోర్టుకు విన్నవించారు.

పిల్లలపై ఎలాంటి నియంత్రణ లేదు

“మల్టీప్లెక్స్‌ల్లో చివరి షో అర్ధరాత్రి 1.30 గంటల దాకా నడుస్తుంది. ఇందులో మైనర్ల ప్రవేశానికి ఎలాంటి నియంత్రణలు లేవు. అర్ధరాత్రి సమయంలో సినిమాలు చూడటం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పుష్ప-2 ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.” అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

ఆ షోలకు పిల్లలకు నో ఎంట్రీ

ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రాత్రి 11 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లోకి పిల్లలను అనుమతించడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు 16 ఏళ్లలోపు పిల్లలను ఉదయం 11లోపు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా ప్రదర్శనలకు అనుమతించరాదని థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశించారు. విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *