Basara:పేరంట్స్​ రాలేదని.. విద్యార్థి ఆత్మహత్య

0
85
Advertisement

బాసర ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమిత్తం ఈనెల 12న తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హాజరు శాతం తక్కువగా ఉందని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. పేరంట్స్​ రాకపోవడంతో విద్యార్థి హాస్టల్‌లోనే ఉన్నాడు.

తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికి ఉరేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌(Nirmal) ఆస్పత్రికి తరలించారు. సీఐ రాకేశ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here