Khammam: కానిస్టేబుల్​ కూతురు..ఐపీఎస్​కు సెలెక్ట్​

UPSC:యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలలో మధిర టౌన్(Madhira) పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. బోనకల్ మండలం(Bonakal) ఎల్ గోవిందపురo గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య(Ravuri Sai Alekya) చిన్నతనం నుండే ఐపీఎస్ (IPS)కావాలని పట్టుదలతో తల్లిదండ్రుల సహకారంతో ఆల్ ఇండియా లెవెల్ లో 938వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1105 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది మే 28న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షను క్లియర్‌ చేసిన వారికి సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో రెండు షిఫ్టుల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించి.. డిసెంబర్‌ 8న మెయిన్స్‌ ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 2, ఏప్రిల్‌ 9 మధ్య వివిధ దశల్లో పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలు ప్రకటించారు.

ఐపీఎస్ గా సెలెక్ట్ అయినా రావూరి సాయి అలేఖ్య కు మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు, టౌన్ ఎస్ఐ సంధ్య మరియు పోలీస్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Share post:

లేటెస్ట్