Breaking:రాజ్యసభకు ఫైర్ బ్రాండ్..తెలంగాణ నుంచి రేణుకా చౌదరి

మన ఈనాడు: ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రేణుకాచౌదరి పేరును ఖరారు చేశారు. హైకమాండ్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో నామినేషన్ దాకలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి రేణుకాచౌదరికి ఇవ్వగా…మరో సీటు ఏఐసీసీకి రిజర్వ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి ఏఐసీసీ నుంచి అజయ్ మాకెన్ లేదా సుప్రియలలో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. మొదటి నుంచీ ఆమె ఖమ్మం పార్లమెంట్ స్థానంపైనే ఫోకస్ చేసారు. సోనియా వస్తారు…కమ్మం నుంచి పోటీ చేస్తారు అన్న టాక్ నడవడంతో కొన్నాళ్ళు దాన్ని పక్కన పెట్టారు. అప్పుడు కూడా సోనియా తప్పుకుంటే ఖమ్మం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని రేణుకాచౌదరి హాట్ కామెంట్స్ చేశారు.

ఇప్పుడు సోనియా రావడం లేదు… మరోవైపు రేణుకా చౌదరి పేరు ఖరారు అయిపోయింది. దీంతో ఖమ్మం లోక్ సభ స్థానాన్ని రేణుకాకే కేటాయించాలని కోరుతూ గాంధీభవన్‌లో ఆమె వర్గీయులు దరఖాస్తు చేశారు. రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలిగా, కేంద్రమంత్రిగా కూడా రేణుకా చౌదరి గతంలో సేవలు అందించారు. ఇప్పుడు ఆమె మారు రాజ్యసభకు నామినేట్ అవుతుండటంతో రేణుకా వర్గీయులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు.

Share post:

లేటెస్ట్