తెలంగాణ(Telangana)లో త్వరలోనే గ్రామ పంచాయితీ ఎన్నికలు(Panchayat Elections) నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. బుధవారం రాత్రి ఆయన TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం ఆయనతో చర్చించారు. ప్రభుత్వ పథకాలను వీలైనంత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని CM సూచించారు. అలాగే జనవరి 26న రైతు భరోసా(Rythu Bharosa) ఇస్తున్నామని చెప్పారు. కూలీ రైతులకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ(Runa Maafi) చేశామని సీఎం స్పష్టం చేశారు. అలాగే త్వరలో కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు.
ఇప్పటికే ఓటర్ల జాబితా రెడీ
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలు(Panchayat Elections) ఉండవచ్చనే సంకేతాలు ఉండటంతో అధికార యంత్రాంగం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా(List of Voters)ను గ్రామాలు, వార్డుల వారీగా రెడీ చేయగా, తాజాగా కొత్త పేర్లను వార్డుల వారీగా సేకరిస్తున్నారు. మరోవైపు ఓటర్లకు సరిపడా బ్యాలెట్ పత్రాల ముద్రణ(Printing of ballot papers) కోసం కసరత్తు మొదలుపెట్టారు. బ్యాలెట్ పేపర్ అధికారులే సరఫరా చేస్తుండగా, దానిపై గుర్తులు మాత్రం ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో ముద్రిస్తారు.
సార్వత్రిక ఎన్నికలు రావడంతో..
అలాగే బరిలో 4, 5గురు, పది మంది ఉన్నట్లు, ఇలా గుర్తులతో ముందస్తుగానే ముద్రించుకొని సిద్ధంగా ఉంచాలా? లేక అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేలాక ముద్రించాలా అనే దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతుండటంతో ఆ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు(General Elections) రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిగదా పడ్డాయి.






