రాజకీయ ఉద్దండులు@ఖమ్మం ఖిల్లా

మన ఈనాడు:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పదవులు..ప్రభుత్వంలో ఉన్నత నిర్ణయాలు తీసుకోవడంలో తమదైన పాత్ర పోషించడం ఖమ్మం నేతలకే సాధ్యం. ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీ ఉన్నా..అందులో ఖమ్మం నాయకుల ఆమోద ముద్ర ఉండాల్సిందే. ముందు నుంచి వామపక్ష పార్టీల ప్రభావం..ఎర్ర జెండా నీడలో పెరిగిన ఖిల్లా కావడంతో..క్రమశిక్షణ రాజకీయాలు..ఆరోగ్యవంతమైన రాజకీయాలకు పోటీగా నెలకొంది.

ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు కలిగిన ఏకైక జిల్లా.. అనే రికార్డు ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లానే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కీలక మంత్రులుగా ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా బీఆర్ఎస్(BRS) నుంచి ఇప్పటికీ హేట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారధి రెడ్డి ఉండగా, తాజాగా భర్తీ చేయనున్న రాజ్యసభ స్థానాల్లో BRS నుంచి వద్దిరాజు కి అవకాశం రావడంతో గురువారం నామినేషన్​ దాఖలు చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకురాలు, మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యురాలు ఫైర్​బ్రాండ్​ రేణుక చౌదరి రాజ్యసభకు వెళ్తున్నారు.

ఖమ్మం పార్లమెంట్​ సీటు ‘అన్న’దే:
త్వరలో జరగనున్న పార్లమెంట్​ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిపై సర్వత్ర చర్చ సాగుతోంది. ఈక్రమంలోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని పోటీకి దింపాలని నేతలు భావించారు. సోనియాగాంధీ పోటీ చేయదనే క్లారీటీ రావడంతో తనకే సీటు కేటాయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఇప్పటికే గాంధీభవన్​లో దరఖాస్తు సైతం చేశారు. కానీ రేణుకచౌదరి రాజ్యసభకు వెళ్లడంతో మంత్రి పొంగులేటి శ్రీనన్న సోదరుడు పొంగులేటి ప్రసాద్​రెడ్డి పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు లైన్​ క్లియర్​ అయినట్లు తెలుస్తుంది.

పొంగులేటికి జిల్లాలో ఉన్న పట్టుతోపాటు మరోసారి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తన కుటుంబ సభ్యులకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. అంతేగాకుండా గత పదేళ్లుగా కార్యకర్తలు, ప్రజలతో ప్రసాద్​రెడ్డితో నేరుగా సంబంధాలు బలపడ్డాయి.

Share post:

లేటెస్ట్