ఈ రోజు నుండి తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ..బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తర్వాత సంపత్ కుమార్ నామినేషన్ దాఖలు సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తారు.
ఉదయం 11గంటలకు అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు గద్వాలలో అభ్యర్థి సరిత తిరుపతయ్య తరపున ప్రజా గర్జన బహిరంగ సభ నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు మఖ్తల్‌లో అభ్యర్థి వాకిటి శ్రీహరి తరఫున ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలకు టీపీసీసీ చీఫ్ హోదాలో భారీ బహిరంగ సభల్లో రేవంత్‌రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం చేస్తారు.
రేపు ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్‌లో కాంగ్రెస్ బహిరంగ సభలు నిర్వహించనుంది. 9న పాలకుర్తి, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో సభలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో మైనార్టీ డిక్లరేషన్ సభ జరగనుంది. ఈ నెల 10 కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి నామినేషన్ వేయనున్నారు. అదేరోజు అక్కడ కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో బహిరంగ సభ నిర్వహించి.. బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.