మన ఈనాడు: తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ అమలు చేయబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుందన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల (Six Guarantees) అమలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటిలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. మిగిలిన గ్యారెంటీలు త్వరలోనే ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు
వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్..
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేర వేరబోతుందని తెలంగాణ ప్రజానీకానికి గుడ్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని మండిపడ్డారు. అందుకే హమీల్లో కాస్త జాప్యం నడుస్తోందని అన్నారు. నిరుద్యోగ బృతి మొదలుకుని రెండు పడకల గదుల ఇళ్ల వరకు అన్ని హమీలను తెరాస సర్కారు విస్మరించందన్నారు.