తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6వ తేదీన తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని వెల్లడించింది.
ఆరోజు జెండా ఆవిష్కరించాలి
తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. జెండా రూప కల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna)కు అప్పగించినట్లు తెలిపింది. ఫిలిం ఛాంబర్ నిర్ణయంపై అందులోని సినీ ఆర్టిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






