filmfare||ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో చరిత్ర సృష్టించేందుకు “బేబి”

Mana Enadu:ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ కు చేరువలో ఉంది. తాజాగా అనౌన్స్ చేసిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 8 నామినేషన్స్ దక్కాయి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ లిరిసిస్ట్, రెండు బెస్ట్ సింగర్..ఇలా 8 మేజర్ విభాగాల్లో బేబి సినిమా నామినేషన్స్ పొందింది. ఈ హ్యూజ్ నామినేషన్స్ చూస్తుంటే త్వరలో హైదరాబాద్ లో జరగనున్న ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

బేబి సినిమాలో హార్ట్ టచింగ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ బెస్ట్ యాక్టర్ గా, ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్ గా, ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించినందుకు బెస్ట్ డైరెక్టర్ గా సాయి రాజేష్, తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసే సాహిత్యాన్ని అందించినందుకు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ బెస్ట్ లిరిక్ రైటర్ విభాగంలో నామినేషన్స్ అందుకున్నారు. ప్రేమిస్తున్నా పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్, ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్స్ గా నామినేషన్ అందుకున్నారు.

గొప్ప సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కుతాయని అనేందుకు బేబి సినిమా తిరుగులేని ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ఈ సినిమాకు గామా సహా జాతీయ, రాష్ట్ర స్థాయిలో రెపుటేషన్ ఉన్న పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కాయి. ఇప్పుడు ఫిలింఫేర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్ లోనూ సత్తా చాటేందుకు బేబి మూవీ రెడీ అవుతోంది.

బేబి సినిమాతో పాటు నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాకు కూడా 8 నామినేషన్స్ దక్కాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *