సంక్రాంతి స్పెషల్.. కొత్త సినిమా పోస్టర్లు ఇవే

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ (Sankranti) వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక థియేటర్లలోనూ సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయింది. ఇక జనవరి 14వ తేదీన వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.

సంక్రాంతి పోస్టర్లు

ఇక సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమా అప్డేట్స్ కూడా వచ్చేశాయి. పండుగ పూటకొత్త సినిమా కబుర్లతో, ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్‌ మీడియా హోరెత్తుతోంది.  ప్రభాస్‌ రాజాసాబ్‌ (Raja Saab) అంటూ కొత్త పోస్టర్‌తో వచ్చేశాడు. మరోవైపు నారీ నారీ నడుమ మురారీ అంటూ శర్వానంద్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన మూవీ హరిహరమల్లు (Harihara Veera Mallu) నుంచి ఓ అప్డేట్ తీసుకొచ్చారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రబృందాలు తమ అప్డేట్స్ షేర్ చేసుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..?

అఖండ తాండవం

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో వస్తున్న మరో మూవీ అఖండ-2 తాండవం (Akhanda 2). సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ ను షేర్ చేసింది. యాక్షన్ స్టార్టెట్ అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఆరంభమైన మహా కుంభమేళాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నారీ నారీ నడుమ మురారీ

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నుంచి చాలా రోజుల తర్వాత ఓ సినిమా అప్డేట్ వచ్చింది. సామజవరగమన సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారీ (Nari Nari Naduma Murari) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వాకు జోడీగా సాక్షివైద్యా, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Related Posts

Telugu Cine Industry: సినీ కార్మికుల సమ్మెకు తెర.. నేటి నుంచి షూటింగ్స్ షురూ

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ(Telugu Cine Industry)ను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె(Cine Workers strike)కు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు(Producers) అంగీకరించడంతో ఈ సమ్మె ముగిసింది. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి(CM Revanth…

Parliament Monsoon Sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. పలు కీలక బిల్లులకు ఆమోదం

భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions of Parliament) వాడీవేడి చర్చలు, నిరసనల మధ్య ముగిశాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఈ సమావేశాలు అనేక కీలక అంశాలపై తీవ్ర చర్చలకు వేదికగా నిలిచాయి. సమావేశాలు 120…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *