CMRevanth : వరదల సమయంలో బురద రాజకీయాలు వద్దు.. విపక్షాలకు రేవంత్ కౌంటర్

Mana Enadu:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరానికి బయల్దేరిన ఆయన మార్గ మధ్యలో వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖఅయమంత్రి మాట్లాడుతూ.. వరదల సమయంలో బురద రాజకీయాలు వద్దని విపక్షాలకు హితవు పలికారు. బెయిల్ వచ్చిందని దిల్లీకి 25మంది ఎమ్మెల్యేల (BRS MLAs)ను తీసుకెళ్తారు కానీ వరదల సమయంలో సామాన్యులకు కాస్త సాయం చేయలేరంటూ బీఆర్ఎస్‌ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
సూర్యాపేట వరదలపై సీఎం సమీక్ష..
మరోవైపు ఖమ్మం జిల్లా వెళ్తున్న రేవంత్ రెడ్డి మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురంలో సీఎం సమీక్ష (CM Revanth Review On Suryapet) నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు.
వరదల సమయంలో బురద రాజకీయాలొద్దు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా (Suryapet Floods)లో 30 సెం.మీ. అతి భారీ వర్షం పడిందని.. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పంట, ఆస్తి నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్లు వెల్లడించారు. కేంద్రం తక్షణమే రాష్ట్రానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిద్ర లేకుండా సమీక్షిస్తున్నాం..
“జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధానిని ఆహ్వానించాం. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం (Flood Victims Ex Gratia) అందిస్తాం. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. సూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా రూ.5 కోట్లు విడుదల చేశాం. మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో ఉంచాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఖమ్మం, నల్లగొండ పరిస్థితి ప్రధాని, హోంమంత్రికి వివరించాను. మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా సమీక్ష చేస్తున్నా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు సొంతంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (SDRF)ను ప్రారంభించుకుంటున్నాం.” అని సీఎం రేవంత్ తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *