Mana Enadu: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) విమర్శించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు(Gudlavalleru)లోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల(Secret Camera) ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపించారు. అతడిపై దాడికి యత్నించారు. ఈ ఘటనపై వైసీపీ అధినేత తీవ్ర విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి: జగన్
‘‘ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆక్షేపించారు. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్(Redbook) రాజ్యాంగం అమల్లోనే ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ(IIIT Nuzvid) సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరోవైపు గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతాకుతలంచేసే ఘటన ఇది. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోండి: CM చంద్రబాబు
మరోవైపు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఘటనతో జూనియర్ విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వారు ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడుకుంటున్న ఆడియో వైరలవుతోంది. ‘2 నెలల నుంచి వీడియోలు తీస్తున్నారంట. 300 వీడియోలు ఉన్నాయని చెబుతున్నారు. మా ఫ్లోర్‌లో అందరూ ఏడుస్తున్నారు. చచ్చిపోవాలనిపిస్తోంది. ఆ కెమెరాలు పెట్టిన అమ్మాయి పొలిటీషియన్ కుమార్తె అని చెబుతున్నారు’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరు కాలేజీలో వీడియోల రికార్డింగ్‌పై నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని CM Chandrabaubu అధికారులను ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ గంగాధర్ వెల్లడించారు.