ManaEnadu: కోలీవుడ్ నటుడు, దళపతి విజయ్ లేటెస్ట్ సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్). దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబరు 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల సెన్సార్ బోర్డు ముందుకు ఈ చిత్రం వెళ్లగా.. బోర్డు ఈ సినిమాకు పలు మార్పులు సూచించింది. ఆ తర్వాత తాజాగా మరోసారి సెన్సార్ పూర్తి చేసి రిపోర్టు ఇచ్చింది.
ఇక ది గోట్ సినిమా సెన్సార్ రిపోర్టులో యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3:03 గంటలు (ఫన్ బ్లూపర్స్తో కలిపి) ఉంది. ఇంతకుముందు 2: 59 గంటలు ఉండగా.. లేటెస్ట్ సెన్సార్ రిపోర్టులో అది 3.03 గంటలకు పెంచినట్లు ప్రస్తుతం ‘ఎక్స్’లో ఈ పోస్టు వైరల్ అవుతోంది. అయితే సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఓ లేడీ క్యారెక్టర్‌కు సంబంధించిన రియాక్షన్ షాట్‌ను తొలగించిందట ఈ చిత్రబృందం. రెండు సెకన్ల నిడివి ఉన్న షాట్‌ను మరో షాట్‌తో రీ ప్లేస్ చేసిందట.
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీ యూజ్ చేసి విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించబోతున్నారు. ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. ఇక స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. కోలివుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో (తమిళనాడులో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో) ఈ సినిమా విడుదల కానుంది.
మరోవైపు తెలుగు ప్రేక్షకులనూ అలరించేందుకు రెడీ అవుతోంది. తమిళనాడులో సెప్టెంబరు 5న ఉదయం 4 గంటలకే మొదటి ఆట ప్రారంభం అవుతుందని టాక్ వినిపిస్తోంది. లియో తర్వాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు.






