Mana Enadu: తెలుగు బుల్లితెర రియాల్టీ షో BIG BOSS-8 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న FANS కోరిక నెరవేరింది. తొలుత DEVARA సాంగ్‌తో హోస్ట్ AKKINENI NAGARJUNA బిగ్ బాస్ హౌస్ స్టేజీమీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆత్వరాత బిగ్ హౌస్ గురించి AV ప్రదర్శించారు. అనంతరం హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కంటెస్టెంట్లను హోస్ట్ అక్కినేని నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్నారు. అంతకు ముందు కంటెస్టెంట్ల ఇంట్రడక్షన్లు, డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో GRAND LAUNCH జరిగింది. ఈ సీజన్ కోసం హౌస్.. Forest థీమ్‌లో ఉంది. జంవుతుల బొమ్మల థీమ్‍తో రూమ్‍లు, కొన్ని వస్తువులు ఉన్నాయి. పచ్చదనం కూడా ఉంది. కాగా BIG BOSS 8వ సీజన్ హౌస్‍లోకి 14 మంది CONTESTENTS ఒక్కొక్కరిగా హౌస్‌లోకి వెళ్లారు.
ఒక్కొక్కరిగా హౌస్‌లోకి వెళ్తున్న కంటెస్టెంట్లు
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ FIRST కంటెస్టెంట్‌గా YASHMI GOUDA ఎంట్రీ ఇచ్చింది. రాగానే నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పి RED ROSES ఇచ్చింది. ఆ తర్వాత ఆ పూలను తనకు ఇవ్వాల్సిందిగా కోరితే.. నాగార్జున అలాగే చేశాడు. యశ్మీని లవర్ ఉన్నాడా అని నాగార్జున అడిగారు. దానకి గతంలో ఉన్నాడని, ఇప్పుడు లేడని, తను విడిపోడానికి తానే కారణం అని యశ్మీ గౌడ చెప్పింది. దాంతో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చాలా లక్కీ అని నాగార్జున అన్నాడు. యశ్మీకి బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దాంతో ఆమెకు BIRYANI TASK ఇచ్చారు. ఐదు బిర్యానీలు ఉంచి.. అవి ఏ రకమైన బిర్యానీలో గెస్ చేయమని నాగార్జున చెప్పారు. కానీ, యష్మీ అన్ని టేస్ట్ చేసి తప్పుగా చెప్పింది. ఈ సీజన్‌లో SOLO ENTRY లేదని, తన బడ్డీస్‌ను సెలక్ట్ చేసుకోవాలని యశ్మీకి NAAG చెప్పారు. దాంతో ఒక RED BOX సెలక్ట్ చేసుకుంది. యశ్మీ. దాని నుంచి సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో లేడి విలన్‌గా చేసిన యశ్మీకి జోడీగా సీరియల్ హీరో NIKHIL ఎంట్రీ ఇచ్చాడు. తనకు విలన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని తెలిపాడు నిఖిల్. అభయ్ నవీన్‌కు బడ్డీగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కంటెస్టెంట్లు స్టేజీమీదకు అడుగు పెడుతున్నారు.
హౌస్‌లోకి స్టార్ హీరో ఎంట్రీ
బిగ్ బాస్ 8 సీజన్‌లోకి TOLLYWOOD స్టార్ హీరో RANA DAGGUBATI ఎంట్రీ ఇచ్చాడు. రాగానే తన సినిమాల గురించి నాగ్ అడిగారు. కొత్తగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నట్లు చెప్పాడు రానా. 35 చిన్న కథ కాదు మూవీ గురించి రానా తెలిపాడు. టెన్త్ క్లాస్‌లో 35 మార్కులు రాక ఫెయిల్ అయినట్లు తెలిపాడు రానా. ఆ తర్వాత హీరోయిన్ నివేదా థామస్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడున్న కంటెస్టెంట్స్‌కు వారితో టాస్క్ ఆడించారు. బాటిల్‌ను ఫ్లిప్ చేసి పక్కన టేబుల్ పై ఉన్న ప్లేట్ జరపాలి. చాలా ఫన్నీగా ఈ గేమ్ ఆడారు. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంట్రో కొనసాగుతోంది.