ManaEnadu:కథలో దమ్ముంటే చాలు అది చిన్న సినిమా అయినా.. డెబ్యూ హీరోతో తీసిన చిత్రమైన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. హీరోల ఇమేజ్‌తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు కాసులు కురిపించడం ఖాయం అని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించిన విషయం తెలిసిందే. అలా చిన్న సినిమా రిలీజ్ అయిన కాంతార (Kantara) చిత్రం పాన్ ఇండియా మూవీగా గుర్తింపు పొందడమే గాక వందల కోట్ల రూపాయల కలెక్షన్లు కురిపించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా ఇదే జాబితాలో మరో చిత్రం చేరింది. బాలీవుడ్లో సాధారణంగా రూ.200 కోట్లు దాటిని సినిమా జాబితా చూసుకుంటే ఇప్పటి వరకు అందరూ స్టార్ హీరోల చిత్రాలే ఉన్నాయి. కానీ మొదటి సారిగా స్టార్ హీరోలకు షాక్ ఇస్తూ, వాళ్ల రికార్డులన్నీ బ్రేక్ చేసింది బీ టౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor). ఆషికీ2, సాహో సినిమాలతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైన విషయం తెలిసిందే. శ్రద్ధా లేటెస్ట్గా నటించిన చిత్రం స్త్రీ-2.
చిన్న సినిమాగా రిలీజ్ అయిన స్త్రీ-2 (Stree2) బాలీవుడ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. బడా బడా హీరోలకు షాక్ ఇస్తూ ఏకంగా 20 రోజుల్లోనే రు.515 కోట్ల వసూళ్లను రాబట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు (Rajkumar Rao), అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందింది. ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఈ మూవీ ఫస్డ్ డే నుంచి కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. ఈ చిత్రంతో పాటు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం వంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా.. స్త్రీ-2 ముందు అవి తేలిపోయాయి.
#OneWordReview…#Stree2: BLOCKBUSTER.
Rating: ⭐️⭐️⭐️⭐️½
Entertainment at its best… Fantastic follow-up to #Stree… Humour + horror + music + #Sarkata, #Stree2 is a solid package… Dear #Boxoffice, brace yourself for a #Tsunami. #Stree2ReviewIt’s a challenge to balance the… pic.twitter.com/KwfvrUaw8Y
— taran adarsh (@taran_adarsh) August 14, 2024
ఈ హార్రర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ను ప్రేక్షకులు విపరీతంగా ఆస్వాదిస్తున్నారు. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.515 కోట్లు (STree2 Collections) సాధించి రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రంలోని హార్రర్ ఎలిమెంట్స్, అదిరిపోయే ట్విస్టులు, మధ్య మధ్యలో కామెడీ, కామెడీతోనే సెటైరికల్‌గా స్పృశించే సామాజిక అంశాలు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. ‘స్త్రీ-2’ మూవీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనిఫిల్మ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అన్నారు.






