Hydra Demolitions: మళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ

Mana Enadu: తెలంగాణలో హైడ్రా(Hydra) అధికారులు మళ్లీ తమ మొదలు పెట్టారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా కాస్త సైలెంట్‌గా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి అక్రమ నిర్మాణాల భరతం పడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఆక్రమణదారులపై హైడ్రా పంజా విసురుతోంది. బాచుపల్లి బౌరంపేట చెరువు, దుండిగల్ కత్వా చెరువు, మాదాపూర్ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలు, విల్లాలను ఇవాళ కూల్చివేస్తోంది. ఈ క్రమంలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మరోవైపు సినీనటుడు మురళీమోహన్‌(Cine Actor Murali Mohan)కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్(Jayabheri Constructions) గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో నోటీసులు ఇచ్చింది. భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, Govt స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది. తరతమ భేదాలు లేకుండా ఆక్రమణలు జరిగినల్లు తేలితే హైడ్రా ఉపేక్షించడం లేదు.

 జయభేరి సంస్థకు నోటీసులు

ఇటీవల మాదాపూర్‌లోని తుమ్మడికుంట చెరువును ఆక్రమించి N కన్వెన్షన్‌ని కట్టారనే ఆరోపణలతో రంగంలోకి దిగిన హైడ్రా(HYDRA) అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. కన్వెన్షన్ యజమాని హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోపే ఎన్ కన్వెన్షన్‌ని నేలమట్టం చేశారు. ఇలా భాగ్యనగర వ్యాప్తంగా ఆక్రమణల తొలగింపుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా టాలీవుడ్‌ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు పంపింది. మురళీమోహన్‌కు(Murali Mohan) చెందిన జయభేరి(Jayabheri) సంస్థకు ఈ నోటీసులు వెళ్లాయి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట చెరువులో FTL, బఫర్ జోన్‌(Buffer Zone)లో జయభేరి సంస్థ అక్రమంగా నిర్మాణాలు జరిపిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissionor Ranganath) చెరువును పరిశీలించి.. ఆక్రమణలు నిజమేనని తేల్చారు. జయభేరి సంస్థకు నోటీసులు అందజేశారు. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని అందులో పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.

 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా: మురళీమోహన్

హైడ్రా నోటీసులపై సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్(Real estate) రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్‌లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. ఆ షెడ్డును తామే తొలగిస్తామని చెప్పారు. కాగా స్థానికుల ఫిర్యాదుతో అధికారులు వచ్చారని మురళీ మోహన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాదాపూర్ సున్నం చెరువు FTL పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ను హైడ్రా కూల్చివేయడంతో మహిళా యజమాని కన్నీరు పెట్టుకున్నారు. GHMCతో పాటు ఎంతో మంది అధికారులకు డబ్బు ఇచ్చి పర్మిషన్ తీసుకొని అపార్ట్‌మెంట్‌ నిర్మించామని తెలిపారు. కోర్టులో కేసు ఉండగా కూల్చివేయడమేంటని, సీఎం తమ కడుపు కొడుతున్నారని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఇవాళ కూల్చివేశారు. కాగా హైడ్రా తాజా నిర్ణయాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *