తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranti) సందడి నెలకొంది. నిన్న భోగి(Bhogi) పండగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్న ప్రజలు.. ఈ రోజు మకర సంక్రాంతి(Makara Sankranti)ని మరింత సంతోషంగా జరుపుకుంటున్నారు. మహిళలు వేకువజాము నుంచే కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు పెట్టారు. అలాగే కోడిపందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఇంటా సంక్రాంతి శోభతో వెలిగిపోతోంది. అంతేకాదండోయ్ హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులతో సంక్రాంతి సందడిగా నిర్వహిస్తుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. కాగా ఈ సంక్రాంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ మకర సంక్రాంతిని పొంగల్(Pongal) పేరిట జరుపుకుంటారు.
ఉత్తరాయణంలోకి సూర్యుడి ప్రవేశం
ఇక మకర సంక్రాంతికి అంటే జ్యోతిష్యశాస్త్రం, తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు(Sun) ధనస్సు రాశి నుంచి మకర రాశి(Capricorn)లోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు(Charities) చేస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు అంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తే మంచి సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే ఈరోజు పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలని చెబుతున్నారు.
![]()
జోరుగా బెట్టింగులు..
ఇక ఈ మూడు రోజుల పాటు కోనసీమ(Konaseema)లో కోడి పందేలు జోరుగా జరుగుతాయి. వీటితోపాటు ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరుల్లో కోడి పందేలు నిర్వహిస్తే.. ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందేలను నిర్వహిస్తారు. ఈ పందేల్లో కోట్ల రూపాయల బెట్టింగు(Bettings)ల రూపంలో చేతులు మారుతుంటాయి. ఇక హైదరాబాదు(HYD)తో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్‌లో ఈ గాలి పటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు, చిత్తూరు ప్రాంతాల్లో జల్లికట్టు(Jallikattu) పోటీలను వేడుకగా నిర్వహిస్తారు.







