తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం(Low pressure effect) పెరిగిపోయింది. బంగాళఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ, తెలంగాణ(Telangana)లపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తాజాగా ఈ అల్పపీడనం బలపడటంతో పలు జిల్లాలకు వాతావరణశాఖ(IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో తూర్పు తెలంగాణ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. అలాగే పలు ప్రాంతాల్లో నేటి నుంచి ముసురుతో పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ (Red Alert) చేసింది.
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
అలాగే మూడు రోజుల పాటు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్ సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సాదారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
India Meteorological Department (#IMD) #Hyderabad has issued a warning of heavy #rains in various districts of Telangana on July 1.https://t.co/xVefgIwciS
— The Siasat Daily (@TheSiasatDaily) July 1, 2025
ఏపీలో మత్స్యకారులకు అలర్ట్
అటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.







