
తెలంగాణలో గద్దర్ అవార్డులు(Telangana Gaddar Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్(Murali Mohan) ఓ కీలక సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్(AP)లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డుల(Movie Awards)ను ప్రకటించాలని కోరారు. తెలుగు సినిమా(Telugu Cinema)కు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రావాలని, వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించాలన్నారు. ఈరోజు గద్దర్ అవార్డుల ప్రకటన కోసం హైదరాబాద్(HYD)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి రావాలి..
‘‘ఒకే తెలుగు సినిమాకు AP, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు(Both Govts) రెండూ అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తుంది. దీనికి బదులుగా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే, మరుసటి ఏడాది AP ప్రభుత్వం ప్రకటించాలి. ఈ పద్ధతి పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు” అని ఆయన సూచించారు.
అది వివాదానికి దారితీస్తుంది..
ఈ సందర్భంగా మురళీమోహన్(Murali Mohan) మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే అని మురళీ మోహన్ అన్నారు.