యూఎస్ ఓపెన్ (US Open 2025)లో రష్యన్ టెన్నిస్ స్టార్ డానియెల్ మెద్వెదేవ్(Daniil Medvedev) మరోసారి వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచాడు. ఫ్రాన్స్(France)కు చెందిన బెంజమిన్ బొంజీ(Benjamin Bonzi)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-3, 7-5, 6-7(5), 0-6, 4-6 స్కోరుతో మెద్వెదేవ్ ఓడిపోయాడు. మ్యాచ్‌లో నాటకీయ మలుపు ఐదో సెట్లో బొంజీ మ్యాచ్ పాయింట్లో సర్వ్ చేస్తుండగా, ఓ ఫొటోగ్రాఫర్(Photographar) అనుకోకుండా కోర్టులోకి ప్రవేశించాడు. దీంతో కాస్త ఆటంకం కలగడంతో ఛైర్ అంపైర్ గ్రెగ్ అలెన్స్వర్త్(Chair Umpire Greg Allensworth) బొంజీకి మళ్లీ ఫస్ట్ సర్వ్(First Serve) అవకాశం ఇవ్వడంపై మెద్వెదేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
INSANE scenes in the Medvedev & Bonzi match at US Open
A cameraman was trying to leave after Bonzi missed his 1st serve.
The umpire gave Bonzi a 1st serve.
Daniil: “Are you a man? Are you a man? why are you shaking? What’s wrong huh? Guys he wants to leave. He gets paid by… pic.twitter.com/nzlqgoWxre
— The Tennis Letter (@TheTennisLetter) August 25, 2025
అంపైర్, ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం
ఈ సందర్భంగా మెద్వెదేవ్ అంపైర్‌ను “మీరు నిజంగా అంపైరా?” అంటూ ప్రశ్నించి, కెమెరామెన్‌ను ఉద్దేశించి “ఇతను గంటలవారీ కాదు, మ్యాచ్‌కు చెల్లింపు పొందుతాడు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ వివాదంతో ఆరు నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఈ గందరగోళంలో బొంజీ ఫోకస్ కోల్పోగా, మెద్వెదేవ్ నాలుగో సెట్‌ను 6-0తో కైవసం చేసుకున్నాడు. అయితే, ఐదో సెట్లో బొంజీ బలంగా తిరిగి పుంజుకుని విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం, ఆగ్రహంతో ఊగిపోయిన మెద్వెదేవ్ తన రాకెట్(Rocket)ను నేల, కుర్చీపై కొట్టి విరగ్గొట్టాడు.
Daniil Medvedev smashed his racket after his first-round loss at the US Open. pic.twitter.com/HJtQAYcfHA
— ESPN (@espn) August 25, 2025
ఈ సీజన్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒకే ఒక్క విజయం
ఈ చర్య అతని కెరీర్లో మరో వివాదాస్పద క్షణంగా నిలిచింది. అయితే అతను తన ఆగ్రహం అంపైర్ నిర్ణయం, ఫొటోగ్రాఫర్లపై కాదని స్పష్టం చేశాడు. ఈ ఓటమితో మెద్వెదేవ్ ఈ సీజన్లో గ్రాండ్‌స్లామ్(Grand Slams)లలో కేవలం ఒకే విజయం సాధించాడు. ఇది అతని కెరీర్లో అత్యంత చెత్త ప్రదర్శనగా రికార్డైంది. కాగా రాకెట్ విరగొట్టి రూల్స్(Rules)ను బ్రేక్ చేసినందుకు భారీ జరిమానా(Fine) విధించే అవకాశం ఉందని మెద్వెదేవ్ స్వయంగా అంగీకరించడం కొసమెరుపు.







