పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. పవన్, యంగ్ డైరెక్టర్ సుజిత్(Sujith) కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్(Priyanka Mohan) నటిస్తోంది. DVV ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రియారెడ్డి(Shriya Reddy) కీలక రోల్ పోషిస్తోంది. అలానే జపనీస్ నటుడు కజుకి కిటముర(Kazuki Kitamura) కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అప్డేట్ బయటకొచ్చింది.
ముంబై బ్యాక్ డ్రాప్‌లో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘OG’ నుంచి టీజర్ వీడియో విడుదలకు సిద్ధమైంది. 1.39 నిమిషాలు (99 సెకండ్లు) రన్ టైంతో కూడిన టీజర్‌కు సెన్సార్ పూర్తయింది. ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఓజీ(OG)లో పవన్‌తో కలిసి DJ టిల్లు హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) ఆడిపాడనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో(Politics) బిజీబిజీగా ఉండటంతో ఆయనపై సీన్స్ మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
పొలిటికల్ కెరీర్ కారణంగానే లేట్
ఇక ఈ మూవీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీతో అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా 2025 వేసవిలో ఓజీని రిలీజ్ చేయనన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓజీతోపాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీలు కూడా పవన్ లిస్టులో ఉన్నాయి. పవన్ పొలిటికల్ కెరీర్ కారణంగానే ఈ సినిమాలు లేట్ అవుతున్నట్లు టీటౌన్ వర్గాలు అంటున్నాయి. మరి వీటిని పవన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
1⃣min 3⃣9⃣ sec OG fire🔥 storm⏳ pic.twitter.com/sBSCn40YeA
— Manobala Vijayabalan (@ManobalaV) January 8, 2025






