
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) తెలంగాణ అవరణ దినోత్సవ శుభాకాంక్షలు (Telangana Formation Day Wishes) తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆశయ సాధన కోసం అందరం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పునరంకితమవుదామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆశయ సాధన కోసం అందరం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.… pic.twitter.com/A6pwRE34lF
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2025
తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు: AP CM చంద్రబాబు
అటు తెలంగాణ ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP Cm Nara Chandrababu Naidu) తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్ భారత్-2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని.. ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తున్నాను’’ అని చంద్రబాబు (X)లో ట్వీట్ చేశారు.
#TelanganaFormationDay
తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో…— N Chandrababu Naidu (@ncbn) June 2, 2025
అటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సైతం శుభాకాంక్షలు తెలియజేశారు.