BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులోనూ టీమ్ఇండియా తడబడింది. సిడ్నీ(Sydney) వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో తొలిరోజు 72.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకే కుప్పకూలింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా(India)ను ఓపెనర్లు మరోసారి నిరాశపర్చారు. జైస్వాల్, రాహుల్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. భారత బ్యాటర్లలో పంత్(40), జడేజా (26) మాత్రమే రాణించారు. జైస్వాల్ (10), రాహుల్ (4), గిల్ (20), కోహ్లీ(17), నితీశ్ (0), సుందర్(14), ప్రసిద్ధ్ (3), బుమ్రా (22), సిరాజ్ (3) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో బొలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2, లయన్ వికెట్ పడగొట్టారు. ఆసీస్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.
పంత్‌కు గాయం
అంతకుముందు భారత బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh pant) గాయపడ్డాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్(Starc) విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాకడంతో వెంటనే వాపు వచ్చేసింది. ఆ నొప్పి(Pain)తో పంత్ విలవిలలాడాడు. బంతి తగిలిన చోట పెద్ద మచ్చలా ఏర్పడింది. వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. ఆ తర్వాత పంత్ తిరిగి ఆటను కొనసాగించాడు. 35 ఓవర్ మూడో బంతికి ఇలా పంత్ గాయపడ్డాడు. బంతి బలంగా తాకడంతో వెంటనే స్టార్క్.. పంత్ వద్దకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత గాయంతోనే పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు
Australian pacers with a commanding display to restrict India on the first day 🙌#WTC25 | Follow #AUSvIND live ➡️ https://t.co/KKLsgkcy4j pic.twitter.com/xACwqkWsWb
— ICC (@ICC) January 3, 2025








