Mahavatar Narasimha: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమేషన్ సంచలనం

గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్(Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించారు. జయపూర్ణ దాస్ రచనతో విష్ణువు నరసింహ అవతార కథను అద్భుత విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 3D ఫార్మాట్‌లో విడుదలైన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా సంచలన కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Mahavatar Narsimha Movie Box Office Collections: Ashwin Kumar Film Brings  In Rs 22 Crore | Regional Cinema News - News18

రూ.100 కోట్ల మార్క్‌ వైపు దూసుకెళ్తోంది

మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్ల గ్రాస్ కలెక్షన్లు(Gross Collections) వసూలు చేసిన ఈ మూవీ.. ఐదు రోజుల్లో రూ.30 కోట్లు, ఆరు రోజుల్లో రూ.42 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.10.95 కోట్లు, హిందీలో రూ.30.10 కోట్ల నెట్ కలెక్షన్లతో రికార్డులను బద్దలు కొట్టింది. రూ. దాదాపు రూ.15కోట్ల బడ్జెట్‌(Budget)తో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటికే రూ.60 కోట్లకు పైగా లాభాలను ఆర్జించి రూ.100 కోట్ల మార్క్‌ వైపు దూసుకెళ్తోంది.

Mahavatar Narsimha: నరసింహుడి ఉగ్రరూపం.. ఫస్ట్ డే రూ. 1.75 కోట్లు.. ఐదో రోజు మీ ఊహకే అందనంత

ప్రహ్లాదుడి(Prahlad) భక్తి, హిరణ్యకశిపుడి(Hiranyakashipu) దుర్మార్గం, నరసింహ అవతార ఘట్టాలను భావోద్వేగంతో కూడిన కథనంతో, అద్భుతమైన యానిమేషన్‌(Animation)తో చిత్రీకరించిన ఈ మూవీ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సామ్ CS సంగీతం, ఎపిక్ విజువల్స్‌తో కూడిన క్లైమాక్స్(Climax) సన్నివేశాలు థియేటర్లలో విజిల్స్‌ను రాగిల్చాయి. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి చిత్రంగా, ఈ సినిమా భారతీయ యానిమేషన్‌కు కొత్త ఒరవడిని సృష్టించింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *