ఎలాంటి విధుల్లోనైనా ఒకానొక స్థాయిలో తమ విధులకు వీడ్కోలు(Retirement) చెప్పడం తప్పదు. అది వృత్తిపరంగా అయినా కావొచ్చు.. ఆటల్లోనూ కావొచ్చు. మరే ఇతర విభాగం అయినా కావొచ్చు. అలాంటి న్యూస్ తాజాగా ఒకటి వైరల్ అవుతోంది. కాకపోతే ఇది క్రికెట్(Cricket) క్రీడకు సంబంధించి కావడం గమనార్హం. చెప్పాలంటే ఈ ఏడాది ఎంతోమంది క్రికెటర్లు(Cricketers) ఎన్నో రికార్డుల(Records)తో అభిమానుల(Fans)ను అలరించారు. ముఖ్యంగా టీమ్ఇండియా(Team India) T20 ప్రపంచకప్ గెలిచి భారత అభిమానులను సంబరాల్లో ముంచెత్తారు. అయితే ఆ టోర్నీ ముగింపులోనే భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) టీ20లకు వీడ్కోలు పలికారు. ఇలా 2024లో చాలా మంది క్రికెటర్లు ఆటకు పాక్షికంగా లేదా, పూర్తిగా వీడ్కోలు పలికారు. వారిలో ఉంది ఉన్నది వీరే..
అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన క్రికెటర్లలో డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్(David Warner), సౌరభ్ తివారీ, వరుణ్ అరోన్, నీల్ వాగ్నర్, కొలిన్ మున్రో, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, డేవిడ్ వీస్, జేమ్స్ అండర్సన్, శిఖర్ ధవన్(Shikar Dhavan), డేవిడ్ మలాన్, విల్ పుకోవ్స్కీ, బరిందర్ శ్రాన్, మోయిన్ అలీ, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, సిద్ధార్థ్ కౌల్, టిమ్ సౌథీ, ఇమాద్ వసీం, మహ్మద్ ఆమీర్, రవిచంద్రన్ అశ్విన్(Ravi Chandran Ashwin)తోపాటు పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ మూడు ఫార్మాట్ల కు వీడ్కోలు పలికాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ టెస్టులకు, షకీబ్ అల్ హాసన్ టెస్టు, టీ20, మహ్మదుల్లా టీ20లకు గుడ్ బై చెప్పారు.
తాజాగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravi Chandran Ashwin) తన మొదటి వన్డే మ్యాచ్ శ్రీలంక(SL)తో 2010 జూన్ 5 ఆడాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు తీయడంతో పాటు 707 పరుగులు చేశాడు.ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్ 2011, నవంబర్ 6న వెస్టీండిస్(WI)పై ఆడాడు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టాడు. 3,503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 65 టీ20 మ్యాచ్ ల్లో 72 వికెట్లు తీయడంతో పాటు 184 పరుగులు చేశాడు.
The Complete List of Cricket Retirements 2024 🏏#rvcjinsta #rvcjsports pic.twitter.com/1iaQH9FjHY
— RVCJ Media (@RVCJ_FB) December 18, 2024








