MH Politics: మహా నాయకుల దారెటు?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయ ఢంకా మోగించింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫఢ్నవీస్ (CM Devendra Phadnavees) మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్ నేతలు శరద్ పవర్,(shardh pawer) ఉద్ధవ్ ఠాక్రేల (uddav takre) భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.

అంచనాలు తలకిందులు

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా కీలకమైనది. ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందిస్తాయి. దేశ రాజకీయాల్లో రోజురోజుకు ప్రతిపక్షాల పాత్ర క్షీణించకపోతున్న విషయం ఆందోళన కలిగిస్తుంది. దీనికి తాజా ఉదాహరణ మహారాష్ట్ర(Maharastra) అసెంబ్లీ ఎన్నికలే.. 288 సీట్లున్న మహారాష్ట్రలో పాలక మహాయుతికి ఏకంగా 235 సీట్లు గెలుచుకుంది. వీటిలో ఒక్క బీజేపీకే 132 సీట్లు దక్కాయి. కూటమిలో భాగస్వాములైన ఏకనాథ్ సిందే శివసేనకు 57 సీట్లు, అజిత్ పవర్ ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అజిత్ పవర్( ajit pawer) ఎన్సీపీ పార్టీలు స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వస్తాయన్న అంచనాలు తలకిందులు అయ్యాయి. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఏర్పాటుచేసిన మహా అఘాడీ వికాస్ కూటమికి మహయుతి కూటమికంటే ఎక్కువగానే సీట్లు వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం శివసేన (ఉద్ధవ్)కు 20 సీట్లు, శరత్ పవర్ ఎన్సిపి పార్టీకి 10, కాంగ్రెస్ 16, సమాజ్ వాదీ పార్టీ రెండు సీట్లతో సరిపెట్టుకున్నాయి.

సుప్రియ సూలేకు పార్టీ పగ్గాలు?

2019 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే అజిత్ పవర్ ఎన్సీపికి(Nationalist Congress Party) శరద్ పవర్ ఎన్సీపీ కంటే మూడింతలు ఎక్కువగా సీట్లు వచ్చాయి. చిరకాలం తన పార్టీకి వెన్నంటే ఉన్న అన్నకొడుకు అజిత్ పవర్ ను కాదని కూతురు సుప్రియ సూలేకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న అజిత్ నిర్ణయం అటు పార్టీని ఇటు శరద్ పవర్ నూ రాజకీయంగా దెబ్బతీసింది. ఉద్ధవ్ ఠాక్రే కూడా శిందేను నిర్లక్ష్యం చేసి భారీ మూల్యం చెల్లుంచుకున్నారు. శిందేకు సరైన పదవి ఇచ్చి, బంధువు రాజ్ ఠాక్రేను (raj takre) కలుపుకుపోయి ఉంటే ఈ రోజు ఉద్ధవ్ పరిస్థితి మరోలా ఉండేది. తాజా మాహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో శివసేన అసలైన వారసులం మేమే అని చాటిచెప్పుకునే అవకాశం శిందేకి లభించింది.

మహా రిజల్ట్స్ వారసత్వ రాజకీయాల డెఫినేషన్ ను మార్చేశాయి. మహా మహా నాయకుల వారసులకే అవకాశాలు కాకుండా పార్టీలో కష్టపడే ప్రతిఒక్కరూ రాజకీయ వారసులు కావచ్చనే నిర్వచనాన్ని అందించాయి. అందుకే శివసేన నుంచి ఏక్ నాథ్ శిందే (eak nath shindhe) , ఎన్సిపీ నుంచి అజిత్ పవార్లు రాజకీయ వారసులుగా నిలదొక్కుకున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *