ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఓటీటీలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man)’ వెబ్ సిరీస్ రెండు పార్టులతో అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీజన్-3తో అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సిరీస్ నుంచి సూపర్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ పూర్తయినట్లు దర్శకధ్వయం రాజ్ అండ్ డీకే సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.
సీజన్-3లో సమంత
ఈ సందర్భంగా రాజ్ అండ్ డీకే (Raj And DK) తమ సోషల్ మీడియాలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 టీమ్ తో దిగిన ఫొటోలను షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోల్లో సమంత (Samantha) కూడా కనిపించడంతో పార్ట్-3లోనూ సామ్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే పార్ట్-2 చివరలో సామ్ క్యారెక్టర్ చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీజన్-3లో మళ్లీ ఆ క్యారెక్టర్ బతికి వస్తుందా..? లేదా సామ్ ఊరికే ఈ టీమ్ తో ఫొటో దిగిందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

అక్కడి నుంచే సీజన్-3
ఇక ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్-1 టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే ది బెస్ట్ వెబ్ సిరీస్ గా సూపర్ హిట్ అయింది. ఇక సెకండ్ సీజన్ శ్రీలంక రెబల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి హిట్ అందుకుంది. సెకండ్ సీజన్‌లో సమంత లీడ్ రోల్‌లో నటించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 (The Family Man Season 3)’ ఎక్కడైతే పూర్తైందో అక్కడి నుంచే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ మొదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. సీజన్ 3 ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఇండియాలో బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలిసింది.
సీజన్-3లోనూ శ్రీకాంత్
ఇక ఈ సిరీస్ సీజన్-3 లో శ్రీకాంత్ తివారీ (manoj bajpayee) పిల్లలు పెద్దవాళ్లు అవుతారట. ఆయనకు వయసు పెరిగినా ఇటు కుటుంబం నుంచి.. అటు వృత్తిపరంగా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ సవాళ్లను శ్రీకాంత్ ఎలా ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సీజన్ 3 వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ సీజన్ కోసం కూడా ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.







