Movies in November: కంగువా, మట్కా, మెకానిక్ రాకీ.. నవంబర్‌లో హిట్టు కొట్టేదెవరో!

Mana Enadu: అక్టోబర్ మంత్ చూస్తుండగానే అయిపోయింది. సినీ ఇండస్ట్రీకి ఈ నెల మిశ్రమ ఫలితాల(Mixed results)ను ఇచ్చింది. గత నెలలో వచ్చిన స్వాగ్, వేట్టయాన్(Vettayaan), మా నాన్న సూపర్ హీరో, విశ్వం, మార్టిన్, జనక అయితే గనక, అమరన్, లక్కీ భాస్కర్(Lucky Bhaskar), క, రామ్‌నగర్ బన్నీ వంటి సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు సైతం థియేటర్లలో విడుదలయ్యాయి. ఇందులో కొన్ని హిట్ టాక్ సొంతం చేసుకోవడంతోపాటు కలెక్షన్లనూ భారీగానే సొంతం చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్(Boxoffice) వద్ద బోల్తా కొట్టాయి. మొత్తంగా గత నెలలో రిలీజైన మూవీలు అభిమానులకు మిక్స్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌(Mixed entertainment)ను అందించాయి.

డ్రై మంత్.. నవంబర్

ఇక నవంబర్ మాసం వచ్చేసింది. అయితే సినీ ఇండస్ట్రీకి ఈనెలను డ్రై మంత్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే దసరా, దీపావళి అక్టోబర్లో రాగా.. క్రిస్మస్, సంక్రాంతికి ఇంకా టైం ఉంది. పైగా నవంబర్‌లో ఒక్క ఫెస్టివల్(Festival) కూడా లేదు. దీంతో పెద్ద సినిమాలు థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనూ కొన్ని చిత్రాలు నవంబర్‌లో అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి అవేంటో ఓ లుక్ వేద్దామా..

 నిఖిల్.. ‘అప్పుడో ఇప్పుడు ఎపుడో’

హీరో నిఖిల్(Hero Nikhil) నటించిన కార్తికేయ-2 తర్వాత తాజాగా వస్తున్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడు ఎపుడో’. డైరెక్టర్ సుధీర్ వర్మ(Sandeep varma) ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. హాట్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మరో వారంలో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్లపై అంతగా ఆసక్తి చూపట్లేదు. ఇప్పటి వరకూ నిఖిల్ సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

సూర్య ‘కంగువా’

ఇక ఈ నెలలో ‘కంగువా(Kanguva)’ సినిమా అందరినీ ఆకర్షిస్తోంది. అంటే నవంబర్ సినిమాల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది కంగువా. సూర్య(Suriya) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 14న రిలీజ్ కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటాని కథానాయిక.

వరుణ్ తేజ్ ‘మట్కా’

నవంబర్‌లో వస్తున్న మరో సినిమా ‘మట్కా(Matka)’. వరుసగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న వరుణ్ తేజ్(VarunTej) ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ‘ఇది నా వాగ్దానం’ అని కూడా వరుణ్ ప్రామిస్ చేశాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ డ్రామా చిత్రం నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలు.

 విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’

విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన ‘మెకానిక్ రాకీ(Mechanic Rocky)’ కూడా ఈ నెలలోనే విడుదలవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. వీటితో పాటు రోటీ కపడా రొమాన్స్, దేవకీ నందన వాసుదేవ వంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో ఏ మూవీ హిట్టు కొడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *