టాలీవుడ్(Tollywood)లో కొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘జటాధర(Jatadhara)’. హీరో సుధీర్ బాబు(Sudheer Babu), దర్శకుడు వెంకట్ కళ్యాణ్(Director Venkat Kalyan) కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా సితార పోస్టర్(Sitara Poster) రిలీజ్ అయింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం భారతీయ పౌరాణిక కథలను ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్(VFX)తో మేళవించి తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రంలో సుధీర్ బాబు యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) హీరోయిన్గా నటిస్తోంది.

డివోషనల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న మూవీ
డివోషనల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster)ను షేర్ చేశారు. ఇందులో యంగ్ బ్యూటీ దివ్యా ఖోస్లా కుమార్(Divya Khosla Kumar) ‘సితార’ పాత్రలో నటిస్తోంది. ఇక విడుదలైన పోస్టర్లో లంగాఓణీలో గార్జియస్ లుక్లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందులో ‘‘శిథిలావస్థలో.. సితార విశ్వాసాన్ని కనుకొంది’’ అని పోస్టర్ రాసి ఉండటం సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar), రైన్ అంజలి, దివ్య విజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
DIVYA KHOSSLA AS SITARA IN ‘JATADHARA’… Every darkness needs its star… #FirstLook poster of #DivyaKhossla as #Sitara from #Jatadhara – an upcoming epic adventure rooted in #Indian mythology.#Jatadhara stars #SudheerBabu and #SonakshiSinha in pivotal roles.
Presented by… pic.twitter.com/Ugh1DvbLYw
— taran adarsh (@taran_adarsh) August 23, 2025






