టీమ్ ఇండియా(Team India)కు కొత్త జెర్సీ(New Jersey) వచ్చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ కొత్త జెర్సీని ఈరోజు ఐసీసీ ఛైర్మన్ జైషా(ICC Chairman Jaisha), భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ఆవిష్కరించారు. దీనిని వైట్ బాల్ క్రికెట్(ODI)లో ప్లేయర్లు ధరించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా(Australia)తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కొత్త జెర్సీని BCCI ఈరోజు రివీల్ చేసింది.
కాగా కొత్త టీషర్ట్ ముందు, వెనుక దాదాపు పాతవాటిలాగే ఉండగా భుజాల మీద మాత్రం త్రివర్ణ పతాక రంగులుండటంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఉమెన్స్ టీమ్‌తో పాటు రోహిత్ సేన(Men’s Team) సైతం ఇకపై ఈ కొత్త జెర్సీలోనే కనిపించనున్నట్లు తెలుస్తోంది. వన్డే(ODI) ఫార్మాట్ కోసం తీసుకొచ్చిన నయా జెర్సీ ఫొటోలు రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి.
కొత్త జెర్సీపై భిన్నవాదనలు
ఇదిలా ఉండగా కొత్త జెర్సీ(Team India New Jersey)పై సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. రంగు ముదురుగా ఉండటంతో ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. లైట్ కలర్(Light Colour)తో నింపేశారని.. బాగోలేదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. దీని కంటే ప్రస్తుత జెర్సీ బెటర్ అని చెబుతున్నారు. T-షర్ట్‌పై దేశం పేరు కంటే స్పాన్సర్ కంపెనీ పేరు పెద్ద సైజులో ఉందని.. ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకుముందు వాటితో పోలిస్తే ఇది క్లాస్‌గా, కూల్‌గా ఉందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy-2025)ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త జెర్సీలను బీసీసీఐ(Board of Control for Cricket in India) డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.
🚨 THE NEW JERSEY OF INDIAN TEAM IN ODIs 🚨 pic.twitter.com/AFCKKsbxTf
— Johns. (@CricCrazyJohns) November 29, 2024








