
రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు(price of gold) మరోసారి కస్టమర్స్‌కు షాక్ ఇచ్చాయి. వరుసగా మూడో రోజు బంగారం రేటు భారీగా పెరగటంతో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి వైపు పసిడి ధర పరుగులు పెడుతోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పుత్తడి ధరలు భగభగమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్(Demand) అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
నేడు (ఫిబ్రవరి 5) 22క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.960 పెరగటంతో రూ.78,100గా నమోదైంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,040 పెరగటంతో రూ.86,240గా నమోదైంది. బడ్జెట్(Budget) తర్వాత బంగారం ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న పసిడి ప్రియులు.. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి ఈ ధరలు చేరటంతో హడలెత్తిపోతున్నారు.
పసిడితోపాటు వెండి పరుగులు
అటు పసిడితోపాటు వెండి(Silver) పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర రూ.1000 పెరిగింది. ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో కిలో ధర రూ.1,07,000కు చేరింది. వచ్చేది పెళ్లిళ్లు, శుభ కార్యాల సీజన్ కావడంతో బంగారం, వెండి రేట్లు ఈరేంజ్‌లో ఉంటే ఎలా కొనగలమంటూ వినియోగదారులు వాపోతున్నారు. అలు దేశీయ స్టాక్‌మార్కెట్లు(Stock Markets) స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. Nifty 23,779 ( +40), Sensex 78,609 (+33) వద్ద చలిస్తున్నాయి. రూపీ(Rupee) వ్యాల్యూ కూడా మరింత క్షీణిస్తోంది. ప్రస్తుతం ఒక US డాలర్‌కు రూ.8708గా రూపీ వ్యాల్యూ ఉంది.