తెలుగులో మోస్ట్ అవైటెడ్ చిత్రం ది రాజాసాబ్(The Taja saab). రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న కామెడీ మూవీ కావడంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఇందులో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తుండగా.. చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్(Posters) ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ వచ్చి చాలా రోజులైంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయట్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరలవుతోంది.
ఆ మధ్య డైరెక్టర్ హింట్ ఇచ్చినా..
ప్రస్తుతానికి పాన్ ఇండియా(Pan India) హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. భారీ బడ్జెట్(Heavy Budget)తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ముందు టీజర్(Teaser) పట్ల ఆసక్తి నెలకొంది. అయితే ఈ మే(May) మిడ్ లోనే ఇది ఉంటుంది అని మారుతీ ఆ మధ్య హింట్ ఇచ్చారు కానీ ఇపుడు వరకు ఎలాంటి అప్డేట్ మళ్లీ లేదు.

తాజా న్యూస్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఇక ఫైనల్‌గా అసలు టీజర్ ఉందా? లేదా? అనేది మారుతీ సన్నిహితుడు అలాగే తనకి సహా నిర్మాత కూడా అయినటువంటి మాస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్‌కేఎన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అటు డైరెక్టర్ మారుతీ సైతం దీనిపై మాట్లాడాడు. కాగా ప్రస్తుతం రాజాసాబ్ పనుల్లోనే బిజీగా ఉన్నారని రానున్న ఈ రెండు వారాల్లోనే టీజర్ రాబోతుంది అని అసలు విషయం రివీల్ చేశారు. ఈ న్యూస్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






