ముంబై టీ 20 లీగ్ (Mumbai T20 League) మే 26 నుంచి జూన్ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉండగా, ఐపీఎల్ షెడ్యూల్(IPL Schedule) ఆలస్యమైన కారణంగా లీగ్‌ను జూన్ 4 నుంచి జూన్ 10 వరకు మార్చారు. ఐపీఎల్ జూన్ 3తో ముగియనున్న నేపథ్యంలో, సర్దుబాటు షెడ్యూల్‌లో రోజుకు రెండు మ్యాచ్‌లు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ డబుల్‌హెడర్ మ్యాచ్‌లు వాంఖడే స్టేడియంతో పాటు, నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని MCA గ్రౌండ్ లేదా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని బ్రబోర్న్ స్టేడియంలో జరగనున్నాయి.
యువ ఆటగాళ్లకు సువర్ణావకాశం..
యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది సువర్ణావకాశం. అయితే ఇప్పుడు ఐపీఎల్‌లో అవకాశాలు రావాలంటే ప్రతి రాష్ట్రంలోని తమ టీంలతో టీ20 లీగ్‌లు ఆడించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇటు హైదరాబాద్ క్రికెట్ అకాడమీ (HCA) కూడా ఐపీఎల్ అయిపోగానే టీ20 లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా ఎక్కువ మంది క్రికెటర్లకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. మెరుగైన అవకాశాలతో పాటు తొందరగా జాతీయ జట్లకు సెలక్ట్ అయ్యే చాన్స్ ఉందని అనుకుంటున్నారు.
వరుణ్ చక్రవర్తి అలా సెలక్ట్ అయినోడే..
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడటం వల్లే వరుణ్ చక్రవర్తి టీం ఇండియా తలుపు తట్టాడు. అక్కడ మెరుగ్గా బౌలింగ్ వేసి తమిళనాడు సెలక్టర్ల దృష్టిలో పడటం, ఇటు KKR యాజమాన్యం కూడా వరుణ్ ఫర్ఫామెన్స్‌ను చూసి టీంలోకి తీసుకుంది. వరుణ్ కూడా దిగ్గజ క్రికెటర్ ధోనీ (MS Dhoni) వికెట్ తీయడంతో ఈజీగా టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందుకే ఇప్పుడు ప్రారంభం కాబోతున్న ముంబై టీ20 లీగ్‌కు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
6/ T20 Mumbai League Rescheduled
New dates: June 4–10Daily double headers
Matches across two venues
Rescheduled due to IPL pause #MumbaiLeague #T20Cricket #MCA #IPL2025 pic.twitter.com/GU8WugkH5Y
— Perry the Platypus (@Phineas______) May 17, 2025






