కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం(Tirumala Srivari Darshan) కోసం భక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు సోమవారం (జూన్ 30) టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 4 గంటల్లోపే వేంకటేశుడి దర్శనం పూర్తవుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 10 కంపార్ట్‌మెంట్ల వరకూ భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా TTD చర్యలు చేపట్టింది.

ఇక నిన్న(ఆదివారం) తిరుమల శ్రీవారిని 88,497భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.29,054 మంది భక్తులు తలనీలాలను సమర్పించగా… హుండీ(Hundi) కానుకలు రూ. 4.34 కోట్లుగా ఉంది. తిరుమలలోని అన్నదాన, కళ్యాణ కట్ట తదితర ప్రాంతాలను టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.






