తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు(Holidays), వారాంతపు సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారి సర్వదర్శనం కోసం వచ్చిన టోకెన్లు(Tokens) లేని భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఇక, శనివారం 87,347 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, ఇవాళ తెల్లవారుజామున భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రేపు ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను TTD రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 24న ఉదయం 10 గంటలకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను విడుదల చేయనుంది. జులై నెల శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ టికెట్లు మే 29న ఉదయం 10 గంటలకు రిలీజ్ కానున్నాయి.






