ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టెండ్ మారింది. ఒకప్పుడు సినీనటులు ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక పాలిటిక్స్‌లోకి వచ్చేవారు. కానీ రాజకీయాల్లో ఓ స్థాయికి చేరుకున్న నేతలు సినిమాల్లోకి రావడం చాలా అరుదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న వారి సంఖ్య తగ్గుతుంటే.. రాజకీయాల్లో బిజీగా ఉన్న నాయకులు సినీ హీరోలు అయిపోతున్నారు.
ఏపీలో వీరే..
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో సినీరంగం వారు ఎక్కువగా AP రాజకీయాల్లో కనిపిస్తుంటారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తోపాటు నాగబాబు, బాలకృష్ణ, పృథ్వీరాజ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు TDPతో చాలా మంది నటులు, నిర్మాతలు ఎప్పటి నుంచో అనుబంధం కొనసాగిస్తున్నారు. ఇక YCPలో పోసాని క్రిష్ణమురళి(Posani), అలీ(Ali) వంటివారు సినీరంగం నుంచి పాలిటిక్స్‌లోకి వచ్చారు. అయితే TGలో మాత్రం సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో ఒక్కరిద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. MLC విజయశాంతి, FDC చైర్మన్ దిల్ రాజు, బండ్ల గణేష్ మాత్రమే సినీ రంగం నుంచి తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
హీరోలుగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు
అయితే ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కథనాయకులుగా చేస్తుండటం విశేషం. ఇటీవల MLCగా ఎన్నికైన అద్దంకి దయాకర్(Addanki Dayakar) హీరోగా ‘ఇండియా ఫైల్స్(India Files)’ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో గద్దర్ కూడా ఓ పాత్ర చేసినట్లు సమాచారం. ఈ మూవీ జులైలో విడుదల కానుంది. ఇక ఇటీవల సంగారెడ్డికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి(Jaggareddy) కూడా ‘ఏ వార్ ఆఫ్ లవ్’ అనే మూవీలో నటిస్తున్నట్లు తెలిపారు. దీంతో సీరియస్ అండ్ సీనియర్ పొలిటీషయన్‌గా బిజీబిజీగా ఉండే జగ్గారెడ్డి సినిమాల్లో ఎలా నటిస్తారన్న న్యూస్ ఆసక్తి పెంచుతోంది.






