ManaEnadu: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Winter Session of Parliament) ఎప్పుడు జరుగుతాయనే తేదీపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు( Parliamentary Affairs Minister Kiren Rijiju) కీలక ప్రకటన చేశారు. NOV 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలు ఈ నెల 25న మొదలై DCE 20వ తేదీ వరకు కొనసాగనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా ప్రకటన విడుదల చేశారు. కాగా నవంబర్ 26న (Constitution Day) పార్లమెంట్ సెంట్రల్ హాల్(Central Hall of Samvidhan Sadan)లో రాజ్యాంగం ఆమోదంపొంది 75 ఏళ్ల సందర్భంగా వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కీలక బిల్లులకు ఆమోదం?
ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రంలో కీలక బిల్లుల(Bills)ను సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వక్ఫ్ బిల్లు(Waqf Bill)కు వివాదాస్పద సవరణలు, కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు(One Nation, one election)’ ప్రతిపాదనకు సంబంధించిన నిబంధనల బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చలు జరిపే అవకాశం ఉంది. వక్ఫ్ బిల్లు సవరణలను ప్రస్తుతం అధికార BJPకి చెందిన జగదాంబిక పాల్ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే.
లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీల లేఖ
అయితే నవంబర్ 29లోగా కమిటీ అధ్యయనం చేసి తాయారు చేసిన నివేదికను పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది. అయితే.. ప్రతిపక్ష MPలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో JPC పనితీరు వివాదాస్పదమైంది. కాగా ఈ బిల్లు ముస్లింల హక్కులను కాలరాస్తోందని ప్రతిపక్షాలు కేంద్రం పై విమర్శల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే సవరణలతో కూడిన ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.