డిస్ట్రిబ్యూటర్లకు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు(Cinema Exhibitors) షాకిచ్చారు. రెంటల్ బేసిస్‌లో మూవీలు రన్ చేయకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ (Theatre Bandh) చేయాలని నిర్ణయించారు. ఇకపై తమకు పర్సంటేజ్(Percentage) రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber)లో ఇవాళ నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు(Dil Raju), సురేశ్‌బాబు(Suresh Babu) సహా 60 మంది ఎగ్జిబిటర్లు సమావేశమై సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
చాలా కాలంగా చర్చలు
కాగా ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్ల(Distributors)కు మధ్య పర్సంటేజీలపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యంకాదని ఎగ్జిబిటర్లు అంటుంటే.. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతల(Producers)కు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు.
#TeluguCinena #Theaters #Exhibitors pic.twitter.com/WqoMjAImGu
— CinemasJunction (@CinemasJunction) May 18, 2025
ఈ మూవీలకు చిక్కులు తప్పవా?
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలన్న ఎగ్జిబిటర్లతో పలు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మే 30న భైరవం, జూన్5న కమల హాసన్ నటించిన థగ్ లైఫ్(Thug Life), జూన్ 12న పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu), జూన్ 27న మంచు విష్ణు మూవీ కన్నప్ప(Kannappa), జూన్ 20న కుబేర్, జులైలో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్(Kingdom) సినిమాతోపాటు పలు చిన్న చిత్రాలు కూడా విడుదల కావాల్సి ఉంది. దీంతో ఆయా మూవీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.






