టాలీవుడ్‌లో ఎక్కువమంది అభిమానులున్న హీరోయిన్ అంటే అనుష్క శెట్టి(Anushka Shetty) అనే చెప్పాలి. ఆమె చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఈ మధ్య కాలంలో మరో హీరోయిన్ చేయలేదు. కెరీర్ ఆరంభంలో విపరీతమైన గ్లామర్ రోల్స్(Glamor rolls) చేసినా.. అరుంధతి(Arundhathi), పంచాక్షరి, రుద్రమదేవి వంటి మూవీస్‌తో సోలోగా సత్తా చాటింది. ఇక ప్రభాస్(Prabhas)తో స్నేహం తనకు మరింత మంది అభిమానులను తెచ్చింది. అతనితోనే చేసిన మిర్చి, బాహుబలి(Bahubali) రెండు భాగాలూ తనను దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులర్ హీరోయిన్‌గా మార్చాయి. బాహుబలి-2తో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోలేకపోయింది. భాగమతితో సోలోగా బ్లాక్ బస్టర్ అందుకుంది.

జులై 11న థియేటర్లలోకి ‘ఘాటి’
కానీ ఆ తర్వాతే వెనక బడింది. పైగా అనూహ్యంగా లావు కావడంతో కొన్ని ఆఫర్స్ కూడా మిస్ అయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తను ‘తగ్గలేదు’. దీంతో సినిమాలకు చాలా గ్యాప్ ఇస్తూ వస్తోంది. లాస్ట్ ఇయర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో మరో విజయం అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం క్రిష్(Director Krish) డైరెక్షన్‌లో ‘ఘాటీ(Ghaati)’అనే చిత్రంతో వస్తోంది. ఈ సినిమా జులై 11న థియేటర్లలోకి రానుంది.

అనుష్కను సంప్రదించిన లోకేశ్ టీమ్
ఇక తాజాగా లోకేశ్ కనకరాజ్(Lokesh Kanagaraj) సినీవర్స్‌లోకి స్వీటీ జాయిన్ అవుతుందీ అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. లోకేశ్ డైరెక్షన్‌లో కార్తి(Karthi) హీరోగా వచ్చిన ఖైదీ సీక్వెల్ ఖైదీ-2(Khaidi-2)లో అనుష్క నటించబోతోందనే న్యూస్ సోషల్ మీడియా(SM)లో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ వార్తల్లో ఏమంత నిజం లేదు. కాకపోతే లోకేశ్ టీమ్ అనుష్కను సంప్రదించారు. ఆ మేరకు నిజం. ఇంకా తను ఓకే చెప్పలేదు. పాత్ర నచ్చితే ఓకే చేసే ఛాన్సుంది. ఒకవేళ అనుష్క రోల్ కూడా పవర్ ఫుల్‌గా ఉంటే స్వీటీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అయితే లోకేశ్-అనుష్క కాంబో(Lokesh-Anushka combo) సెట్ అయితే బొమ్మ దద్దరిల్లుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#Kaithi2 : #AnushkaShetty not part of the #Karthi film, she was never even approached for the film. pic.twitter.com/nwWOvha3V6
— MOHIT_R.C (@Mohit_RC_91) June 15, 2025






