కొద్దిరోజులపాటు బోసిపోయిన థియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. సూపర్హిట్ టాక్తో ప్రస్తుతం ‘కుబేరా’ సందడి చేస్తోంది. ఇక ఈ వారం మరికొన్ని ఆసక్తికర చిత్రాలు విడుదల కానున్నాయి. భారీ తారాగణం నటించిన కన్నప్పతోపాటు మరికొన్ని సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ఓటీటీలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించనున్నాయి. మరి అవి ఏమిటి? ఎప్పుడు రాబోతున్నాయో చూద్దాం
జూన్ 27న కన్నప్ప..
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కన్నప్ప’ (kannappa). ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రీతి ముకుందన్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విజయ్ ఆంటోనీ (Vijay Antony) తాజా చిత్రం ‘మార్గన్: ది డెవిల్ ’ (Maargan) జూన్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాజోల్ (Kajol) కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘మా’ (Maa) సైతం జూన్ 27న విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
నెట్‌ఫ్లిక్స్
* పింటు పింటు సుర్గా (మూవీ) ఇంగ్లీష్ జూన్ 26
* రైడ్2 (హిందీ మూవీ) జూన్ 27
* స్క్విడ్ గేమ్: ఫైనల్ సీజన్ (వెబ్‌సిరీస్) జూన్ 27
* ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (రియాల్టీ షో) జూన్ 28
అమెజాన్ ప్రైమ్
* పంచాయత్ 4 (హిందీ సిరీస్) జూన్ 24
జియో హాట్‌స్టార్
* తు దడ్కన్ మే దిల్ (హిందీ మూవీ) జూన్ 23
* ది గిల్డెడ్ ఏజ్ (వెబ్‌సిరీస్: సీజన్3) జూన్ 23
* ఐరన్ హార్ట్ (మూవీ) జూన్ 25
* స్మార్ట్ ఆఫ్ బ్యూటీ (వెబ్‌సిరీస్) జూన్ 26
* ది బేర్ (వెబ్‌సిరీస్: సీజన్4) జూన్ 26
* మిస్టరీ (వెబ్‌సిరీస్) జూన్ 27
* ది బ్రూటలిస్ట్ (మూవీ) జూన్ 28
జీ5
* విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సిరీస్) జూన్ 27
* బిబిషన్ (బెంగాలీ వెబ్‌సిరీస్) జూన్ 27






