ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న నితిన్ (nithiin) మూవీ ‘తమ్ముడు’ (Thammudu) ఈ వారమే రిలీజ్ కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లు కాగా.. సీనియర్ నటి లయ నితిన్ అక్క పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ జులై 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా మూవీ ‘3 బీహెచ్‌కే’ (3 BHK). శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కూడా జులై 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
వీటిపైనా ఓ లుక్కేయండి
జురాసిక్ ప్రపంచంలో ఏడో భాగం రాబోతోంది. ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘జురాసిక్ వరల్డ్ రీ బర్త్’ (Jurassic World Rebirth) పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 4న ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. యంగ్ హీరో సుహాస్‌తో కీర్తి సురేశ్ జతకట్టి నటించిన మూవీ ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu) అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4నే విడుదలవుతోంది. ఇక ప్రియమణి ప్రధాన పాత్రలో కోర్టు డ్రామా నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘గుడ్ వైఫ్’ (Good Wife) జియో హాట్‌స్టార్ వేదికగా జులై 4న రిలీజ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో
* హెడ్ ఆఫ్ స్టేట్ (మూవీ) జులై 2
* ఉప్పు కప్పురంబు (మూవీ) జులై 4
నెట్‌ఫ్లిక్స్
* ది ఓల్డ్ గార్డ్2 (ఇంగ్లీష్ మూవీ) జులై 2
* బిచ్ వర్సెస్ రిచ్ (వెబ్‌సిరీస్: సీజన్2) జులై 3
* ది శాండ్‌మ్యాన్ (వెబ్‌సిరీస్:సీజన్2) జులై 3
జియో హాట్‌స్టార్
* క్యాంపైన్ (మూవీ) జూన్ 30
* గుడ్ వైఫ్ (వెబ్‌సిరీస్) జులై 4
* లా అండ్ ద సిటీ (మూవీ) జులై 5
జీ5
* కాళీధర్ లాపతా (మూవీ) జులై 4
సోనీలివ్
* ది హంట్: ది రాజీవ్‌గాంధీ అస్సాస్సినేషన్ కేస్ (మూవీ) జులై 4
ఈటీవీ విన్
* ఎయిర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (వెబ్‌సిరీస్) జులై 4






